తెలుగు లో రానున్న 'నేనే షబాన' సినిమా
- February 15, 2017
శివమ్ నైర్ దర్శకత్వం లో తాప్సి , అక్షయ్ కుమార్ , ప్రిథ్వీరాజ్ సుకుమారన్, మనోజ్ బాజ్పాయ్ , అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో హిందీ లో తెరకెక్కుతున్న మూవీ నామ్ షబానా. తాజాగా ఈ మూవీ ని తెలుగు లో నేనే షబాన పేరిట డబ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి కథను నీరజ్ పండేయ్ అందించగా ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్ ఫై నీరజ్ పండేయ్ , షీతల్ భాటియా లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2017 మార్చి 31 న ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు లో విడుదల కాబోతుంది. ఇప్పటికే తాప్సి బాలీవుడ్ లో అడుగుపెట్టి వరుస అవకాశాలతో పాటు సక్సెస్ లు చవిచూస్తోంది. ఈ నేపథ్యం లో ఈ మూవీ కూడా తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని గట్టి నమ్మకం తో ఉంది.
ఇక తెలుగు లో నటించిన ఘాజీ మూవీ ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంకల్ప్ రెడ్డి అనే నూతన దర్శకుడు ఈ మూవీ తో పరిచయం కాబోతున్నాడు. లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో రానా ఈ మూవీ లో నటించాడు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







