కతార్లో ఆహారపదార్ధాల పేకేజింగ్, లేబిలింగ్ పై సందేహాలు

- September 18, 2015 , by Maagulf
కతార్లో ఆహారపదార్ధాల పేకేజింగ్, లేబిలింగ్  పై సందేహాలు

ఆహారపదార్ధాల పేకేజింగ్, లేబిలింగ్   పై కతార్  వినియోగదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దోహాలోని అనేక పెద్ద సూపర్ మార్కెట్లలో తయారుచేయబడి, విక్రయించబడే బ్రెడ్, ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ బాగ్ లలో ప్యాక్ చేయబడుతుంది, మరియు దానిపై ఉన్న అంతర్జాతీయ చిహ్నం, పాక్కెజింగ్ పదార్ధం సురక్షితమని తెలియజేస్తుంది. సెప్టంబర్ 2013 న, ప్రజారోగ్య శాఖ,  ఆహారపదార్ధాలను పేక్ చేయడానికి పాలీ ఇథలీన్, వార్తాపత్రికలను, ఇతర కాగితాలను వాడటాన్ని నిరోధించింది. కానీ కొన్ని హైపర్ మార్కెట్లను సో దా చేసినపుడు, కొన్ని రకాల అరబిక్ బ్రెడ్ లపై కేవలం తయారీదారు పేరు, ఫోన్ నంబర్లు మాత్రమే ముద్రిచబడటం, చపాతీ వంటి కొన్ని పదార్ధాలపై వాడబడిన పదార్ధాల వివరాలు తప్ప, వాటి పోషకవిలువల గురించి తెలియక పోవడం వంటి అంశాలు గమనించారు. హమాద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) ,  ఒఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఛైర్మన్ - ప్రొఫెసర్ అబ్దుల్-బడీ-అబూ-సమ్రా  ఇటీవల - ప్లాస్టిక్ కాగితాలను, ప్లాస్టిక్ డబ్బాలను వాడటం వలన రసాయనాలు పదార్ధాలలో కలిసే అవకాశముందని, ఇందుకై PVC ప్లాస్టిక్ ను వాడటం ఉత్తమమని తెలిపారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com