బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించిన భారత్
- February 17, 2017
మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సూపర్‌సిక్స్ పోరులో భారత్ విజయవంతంగా దూసుకుపోతోంది. కొలంబోలో శుక్రవారం భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.
టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155పరుగులు చేసింది. 156పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. 33.3ఓవర్లలో 158పరుగులు చేసి బంగ్లాదేశ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత జట్టుకు ఈ సిరీస్‌లో ఇది వరుసగా ఆరో విజయం. ఓపెనర్ మోనా మేష్రమ్(78, నాటౌట్), కెప్టెన్ మిథాలి రాజ్(73, నాటౌట్) చెలరేగడంతో భారత్ లక్ష్యాన్ని సులువుగా దాటింది. బౌలర్లు జోషి 3, డీపీ వైద్య 2, ఎస్ పాండే, ఆర్ఎస్ గయక్వాడ్ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







