'హిందూ వివాహ బిల్లు'కు పాక్‌లో ఆమోదం
- February 18, 2017ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ‘హిందూ వివాహ బిల్లు 2017’ను అక్కడి సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. హిందువులకు సంబంధించి ఇదే తొలి వ్యక్తిగత చట్టం. ఈ బిల్లు చట్ట రూపం దాల్చేందుకు పాక్ అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంది. ఇందులో హిందువుల వివాహం, వివాహా రిజిస్ట్రేషన్లు, విడాకులు, తిరిగి వివాహం చేసుకోవడం తదితర అంశాలు ఉంటాయి. దీని ప్రకారం స్త్రీ, పురుషుల వివాహ వయస్సు 18 సంవత్సరాలు.
ఈ బిల్లుతో అక్కడి హిందూ మహిళలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. వారి వివాహానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం తీసుకునే వీలు ఏర్పడుతుంది.
పాక్‌లో హిందువులు ఎక్కువగా ఉన్న పంజాబ్, బలోచిస్థాన్, ఖైబర్ఫంక్తువా ప్రాంతాల్లో దీన్ని అమలు చేయనున్నారు. సింధ్ ప్రావిన్స్‌లో ఇప్పటికే సొంత హిందూ వివాహ చట్టం అమలులో ఉంది. ఈ బిల్లును పాక్ న్యాయశాఖ మంత్రి జహిద్ హమీద్ సభలో ప్రవేశపెట్టారు. సభలోని హిందూ సభ్యుడు రమేశ్ కుమార్ వాంఖ్వానీ మూడేళ్లుగా ఈ బిల్లు ఆమోదం కోసం కృషిచేశారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్