ఇకపై ఆధార్ ఉండాల్సిందే స్కాలర్షిప్ కావాలంటే
- February 18, 2017
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాలు అందుకోవాలంటే ఇకపై ఆధార్ గుర్తింపు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించింది. ఇప్పటికే స్కాలర్షిప్పులు పొందుతున్నవారు జూన్ 30 నాటికల్లా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా దీని నుంచి జమ్మూ కాశ్మీర్‌ను మినహాయిస్తున్నట్టు హెచ్ఆర్డీ తెలిపింది. కేంద్ర రంగ ఉపకారవేతనాల పథకం కింద స్కాలర్షిప్లు అందుకోగోరిన కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థులు సహా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పొందాలనుకుంటున్న పిల్లలు సైతం జూన్ 30లోగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని హెచ్చార్డీ వెల్లడించింది.నేరుగా విద్యార్ధుల ఖాతాల్లోకి స్కాలర్షిప్ జమ చేయడంతో పాటు ఆధార్ అనుసంధానం వల్ల ఈ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం







