స్మార్ట్ ఫోన్ల ఛాటింగ్ వల్ల అనారోగ్యాలు
- February 18, 2017
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో రాత్రిపూట నిద్ర చాలామందికి కరువైంది. పనుల్ని చక్కబెట్టుకుని నిద్రకు ఉపక్రమించే ముందు సోషల్ మీడియా, ఛాటింగ్ వంటివి చేస్తూ వాటితో గంట గంటలు గడిపేస్తున్నారు. దీంతో నిద్ర తగ్గుతోంది. టెక్నాలజీ పెరగడం వలన పని ఎంత వేగవంతం అయిందో దాని వలన కలిగే హాని కూడా అంతే వేగం అయింది.
ముఖ్యంగా యువత, సాఫ్ట్ వేర్ జాబర్స్ సోషల్ మీడియాకు అలవాటుపడి సరైన నిద్రకు దూరమవుతున్నారు. దీంతో అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. చాలామంది ఎక్కువగా చాట్ చేస్తూ, లేదా సినిమాలు చూస్తూ టైం తెలియకుండా రాత్రి నిద్రపోకుండా గడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువగా పెరుగుతుంది.
రాత్రి ఎప్పుడో నిద్రపోయి ఉదయానే లేచి స్టూడెంట్స్ అయితే హడావిడిగా కాలేజ్‌కి, ఉద్యోగులు ఆఫీసులకు రెడీ అయి వెళ్తుంటారు. ఇలాంటి వారికి రానున్న రోజుల్లో చాలా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువత కనీసం 7-9 గంటలు, టీనేజర్స్ 8-10 గంటలు, చిన్న పిల్లలు అయితే 11-14 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెప్తున్నారు. అందుకే నిద్రపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. కనీసం రోజుకి 7 గంటలు నిద్రపోకపోతే.. ఒబిసిటీ తప్పదంటున్నారు.
నిద్రకు ఉపక్రమించడానికి మూడు గంటల ముందు వ్యాయామం చేస్తే హాయిగా నిద్రపోవచ్చు. పడుకొనే ముందు కాఫీ, టీ లాంటివి తాగవద్దు. గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. అంతేకానీ ఫోన్లకు అలవాటు పడితే అనారోగ్య సమస్యలు తప్పవని, డయాబెటిస్, ఒబిసిటీ వంటి ఇతరత్రా సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









