స్టాన్ఫోర్డ్ నుంచి ఆహ్వానం కేటీఆర్కు
- February 18, 2017
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీæ శాఖ మంత్రి కేటీఆర్కు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది మే 18, 19 తేదీల్లో జరిగే స్టాన్ఫోర్డ్ వర్సిటీ వార్షిక సదస్సులో ఉపాధి-ఉద్యోగాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంశాలపై ప్రసంగించాల్సిందిగా వర్సిటీ కోరింది. ఐటీ రంగంలో గత రెండున్నరేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి, టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకున్న అవకాశాలపై మాట్లాడాలని విజ్ఞప్తి చేసింది.
ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులు హాజరవుతారని, వీరికి తెలంగాణ సాధించిన ప్రగతి ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని మంత్రికి పంపిన లేఖలో స్టాన్ఫోర్డ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ అంజిని కొచ్చర్ పేర్కొన్నారు.
గతేడాది కూడా ఆహ్వానం వచ్చిందని, వరుసగా రెండో ఏడాది తనకు ఆహ్వానం రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







