దుబాయ్ వ్యక్తి స్టంట్ డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్...ఆపై అరెస్టు
- February 18, 2017
దుబాయ్ : " నలుగురికి నచ్చినదీ ...నాకసలే నచ్చదురో ...నరులెవ్వరు నడవని దారిలో నేను నడిచెదరో ...నిండు చంద్రుడు ఒకవైపు ఈ దుబాయ్ డ్రైవర్ బాబు ఒకవైపు " ....అది నా మానరిజం అని హీరో మహేషబాబు మాదిరిగా పాట పాడుకోవడం దుబాయిలో మాత్రం కుదరదు ! నల్గురు చూస్తున్నారంటే చాలు వింత వింత విన్యాసాలాలతో కొందరు డ్రైవర్లు రోడ్లపై చెలరేగిపోతారు..సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత మరింత పరిణితి చెందింది.. మా గొప్పదనం.. సాహసం చూడండహో అంటూ ఆ వీడియోలను పోస్ట్లు చేయడం ఇటీవల అధికమైంది. లైకులు ఎన్ని వచ్చేయో కానీ... పోలీసుల నుంచి మాత్రం బోలెడు రిస్కులు వచ్చేయి. స్టంట్ డ్రైవర్లు పోస్టు చేసిన వీడియోల కారణంగా ఇటువంటివారిని పట్టుకోవడం ఖాకీలకు మహా సులువైంది. రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మానాలని ..అటువంటి వీడియోలను ఆన్లైన్ లో పోస్ట్ చేయరాదని పోలీసులు నివాసితులను పదే పదే కోరుతున్నా ఆ చేష్టలు కొందరు మానడం లేదని వాపోతున్నారు. దుబాయ్ లోని ప్రసిద్ధ వల్క్ నగరం వద్ద నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన యుఎఇ జాతీయుడిని దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ అరెస్టు చేశారు. ఆ వ్యక్తిపై మరింత చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు ఈ కేసు బదిలీ చేయబడింది. ప్రజలు చక్కని వాతావరణంను ఆస్వాదించాలీ కానీ, రహదారి భద్రతా నియమాలు, ఉల్లంఘించరాదని అవి పలు ప్రమాదాలకు దారి తీయవచ్చని పోలీస్ అధికారి బ్రిగేడియర్ మోహార్ అల్ మజ్రౌయి అభ్యర్ధించారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







