మేలో శ్రీలంకకు వెళ్లనున్న మోదీ
- February 18, 2017
శ్రీలంకలో మే నెలలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే బౌద్ధ ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక న్యాయ మంత్రి విజయదాస రాజపక్సేను ఉటంకిస్తూ స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది. కొలంబోలో తొలిసారి నిర్వహిస్తున్న 'యూఎన్ వేసాక్ డే' వేడుకల్లో పాల్గొనడానికి మోదీ అంగీకరించినట్లు తెలిపింది.
ఈ ఉత్సవాలను ఏటా బౌద్ధ మతస్థులున్న దేశాల్లో జరుపుకుంటారు. మే నెలలో నిండు చంద్రుడు కనిపించే రోజుకు సమీపంలోని ఆదివారం రోజున భక్తులు బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మే 12న జరిగే ఈ కార్యక్రమానికి పలు దేశాల నాయకులను ఆహ్వానించారు. చైనా, భారత్, జపాన్ , థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, మయన్మార్, లావోస్, టిబెట్ , భూటాన్, తదితర బౌద్ధ ప్రధాన దేశాల నుంచి వేయికి పైగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







