సంగీత దర్శకురాలిగా మారనున్న ఆమిర్ ఖాన్ కుమార్తె

- February 19, 2017 , by Maagulf
సంగీత దర్శకురాలిగా మారనున్న ఆమిర్ ఖాన్ కుమార్తె

బాలీవుడ్‌లో నటుల పిల్లలు సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. షారుక్‌ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, శ్రీదేవి కుమార్తెల తెరంగేట్రంపై ఇప్పటికే బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ఖాన్‌ కుమార్తె ఇరా కూడా సినిమాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు బీటౌన్‌లో చెప్పుకుంటున్నారు. అయితే ఇరా మిగిలిన వాళ్లలా నటిగా కాకుండా సంగీత దర్శకురాలిగా మారాలని అనుకుంటుందట. ఆమీర్‌ఖాన్‌ కుమార్తె ఇరాకు చిన్నప్పట్నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే సంగీతం కూడా నేర్చుకుందట. అయితే సంగీతాన్నే తన కెరీర్‌గా మలుచుకోవాలని భావించలేదట. కానీ.. ఇప్పుడు అదే సంగీతం విభాగంలో పని చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమీర్‌ నిర్మించిన ‘ఢిల్లీ బెల్లీ’.. ‘తలాష్‌’ చిత్రాలకు సంగీతం అందించిన రామ్‌ సంపత్‌ వద్ద ఇరా శిష్యరికం చేయనుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com