అఖిల్ రెండో మూవీ అనౌన్స్ చేసిన నాగ్

- February 19, 2017 , by Maagulf
అఖిల్ రెండో మూవీ అనౌన్స్ చేసిన నాగ్

హీరో గా అఖిల్ ఎంట్రీ ని గ్రాండ్ గా ఇద్దామని అనుకున్న నాగార్జున కు 'అఖిల్ ' రూపం లో పెద్ద షాకే తగిలింది. మాస్ డైరెక్టర్ వినాయక్ చేతులో పెట్టి నాగ్ పెద్ద తప్పే చేసాడనే విమర్శలు వచ్చాయి. దీంతో అఖిల్ రెండో సినిమాపై చాల జాగ్రత్తలు తీసుకుని , అక్కినేని ఫ్యామిలీ కి పెద్ద హిట్ ఇచ్చిన మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ చేతులో అఖిల్ రెండో మూవీ పెట్టాడు..మొదట విక్రమ్ వినిపించిన కథ పెద్దగా నచ్చక పోవడం తో , రెండో ఛాన్స్ ఇచ్చాడు. వేరే కథ వినిపించిన విక్రమ్ , నాగ్ కు ఆ కథ బాగా నచ్చిందట , ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని మార్చి నెలలో ఈ మూవీ సెట్స్ ఫై కి రాబోతుందని నాగ్ ప్రకటించాడు. ఎప్పటినుండో అక్కినేని అభిమానులు అఖిల్ రెండో మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యం లో నాగ్ ఈ వార్త ప్రకటించడం తో అందరు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com