మంచు మనోజ్ కోసం చిరంజీవి!
- February 20, 2017
హైదరాబాద్: ‘ఖైదీ నంబర్ 150’తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రానా నటించిన ‘ఘాజీ’ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించిన చిరు.. ఇప్పుడు మరో చిత్రంలో తన గొంతును వినిపించనున్నారు. మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’. లవ్‌లో పడ్డాడు అనేది ఉప శీర్షిక. ఎస్.కె.సత్య దర్శకుడు. ప్రగ్యాజైశ్వాల్ కథానాయిక. ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కథానాయకుడు మంచుమనోజ్ చిరుకి కృతజ్ఞతలు తెలిపారు. ‘వరల్డ్స్ స్వీటెస్ట్ పర్సన్. మా చిత్ర బృందం నుంచి ధన్యవాదాలు మెగాస్టార్ గారు. ’ అంటూ మనోజ్ పేర్కొన్నారు.
చిరు మాస్ గెటప్‌లో ఉన్న పోస్టర్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. మార్చి 3న ‘గుంటూరోడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవలే మనోజ్ తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి చిరంజీవిని కలిశారు. ‘మా నాన్నగారితో పాటు మెగాస్టార్ చిరంజీవి అంకుల్, సురేఖ ఆంటీతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశాను.
స్వీటెస్ట్ ఫ్యామిలీ’ అంటూ మనోజ్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!







