బహరేన్ లో మరణించిన ప్రవాసీయ భారతీయుడు
- February 20, 2017
తన కుటుంబాన్ని కడసారిగా చూడాలని బహుశా ఆయనకు అనిపించిందేమో .. మృత్యువు తనను కబళించనుందని ముందే తెలిసిందన్నట్లుగా ఒక ప్రవాసీయ భారతీయుడు స్వదేశానికి వెళ్ళి కుటుంబంతో రెండు నెలలు సంతోషంగా గడిపి ఇటీవలే బహరేన్ వచ్చారు. పట్టుమని పదిహేను రోజులు గడవకముందే ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన బహరేన్ లో మరణించడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన చేరువత్తూర్ కుంజుమోన్ షినోయ్ (45) సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు. బహరేన్ లోని పశ్చిమ తీర ప్రాంతం మల్కియా లోని ఒక షాపులో టైలర్ గా పని చేసేవారు. ఆయనకు భారతదేశంలో నివసిస్తున్న భార్య సంధ్య షినోయ్ మరియు 3 సంవత్సరాల అరేయిన్ అనే బాలుడు ఉన్నారు. గత 20 ఏళ్ళ నుంచి బహరేన్ లో టైలరింగ్ వృత్తి కార్మికుడైన కుంజుమోన్ షినోయ్ ఇటీవలే తన స్వస్థలమైన భారతదేశంలోని కేరళ రాష్ట్ర త్రిస్సూర్ జిల్లాలో చియ్యరంలో రెండు నెలల సెలవులను కుటుంబం తో సంతోషంగా గడిపిన తర్వాత ఫిబ్రవరి 7 వ తేదీన తిరిగి బహరేన్ కు ఆయన వచ్చారు. ఆయన సహచర రూమ్మేట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోమవారం తెల్లవారుజామున 4.20 సమయంలో కుంజుమోన్ షినోయ్ తనకు విపరీతమైన గుండె నొప్పి వస్తుందని మాట్లాడారని తనకు ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని పేర్కొన్నట్లు తెలిపారు. దాంతో స్పందించిన తాము అంబులెన్స్ ని వెంటనే అక్కడకు పిలిచామని ఆయనను రక్షించే ప్రయత్నం చేసేరని కొంత సమయం గడిచేసరికి ఆయన అక్కడికక్కడే మరణించినట్లు వైద్యసిబ్బంది ప్రకటించారు. షినోయ్ భౌతికకాయంను సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మృతదేహాలను భద్రపరిచే గదిలో ఉంచబడింది. కాగా , కుంజుమోన్ షినోయ్ సోదరుడు శిబు మనామాలో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









