ఫేక్‌ వీసా కుంభకోణం: ఓ వ్యక్తి అరెస్ట్‌

- February 20, 2017 , by Maagulf
ఫేక్‌ వీసా కుంభకోణం: ఓ వ్యక్తి అరెస్ట్‌

ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఫేక్‌ వీసాలు తయారు చేస్తూ పలువుర్ని మోసగించిన కేసులో అరెస్టయ్యాడు. షార్జా కోర్ట్‌లో ఈ కేసు విచారణలో ఉంది. రెసిడెన్స్‌ వీసాల్ని అందజేస్తానని చెప్పి, ఫేక్‌ వీసాల్ని బాధితులకు అందించి 100,000 దిర్హామ్‌లను కాజేశాడు నిందితుడు. మోసగాడని తెలియక అతన్ని నమ్మిన పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి, 100,000 చెల్లించాడు. అయితే దుబాయ్‌కి వెళ్ళేందుకోసం ఇస్లామాబాద్‌ చేరుకోగా, అక్కడే వారికి తమ వద్దనున్న వీసా ఫేక్‌ అని తేలింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి బాగోతం బయటపడింది. కేసు విచారణ వాయిదా పడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com