యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రికెటర్‌గా

- February 22, 2017 , by Maagulf
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రికెటర్‌గా

ఎలాంటి పాత్రలోకైనా సునాయాసంగా పరకాయప్రవేశం చేయగల యంగ్ టైగర్ ఎన్టీఆర్... ఈ సారి క్రికెట్ బ్యాట్ చేపట్టనున్నాడని తెలుస్తోంది. నటనా పటిమ విషయంలో సమకాలీన హీరోలకన్నా ఓ మెట్టు పైనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు క్రికెట్ ఫీల్డ్‌లోకి దిగబోతున్నాడు. స్వతహాగా క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే తారక్... బ్యాట్‌తో ప్రత్యర్ధులను బెంబేలెత్తించనున్నాడు. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్ హీరోగా ఓ మాంచి కథ ముస్తాబవ్వగా.... అన్నీ అనుకూలిస్తే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. అదే జరిగితే ఇప్పటివరకూ ఎన్నో పాత్రలకు జీవం పోసిన యంగ్ టైగర్ ఈ పాత్రలో చొచ్చుకెళ్లిపోతాడని సినీ జనాలు భావిస్తున్నారు. మరోవైపు... జై లవ కుశ తరువాత...
తారక్ టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్‌తో చేతులు కలపబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే... అయితే అనుకోని కారణాల వల్ల త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవ్వడంతో...

ఎన్టీఆర్ చిత్రం మొదలవ్వడానికి మరింత సమయం పట్టేట్టు కనిపిస్తోంది. దీంతో ఈ గ్యాప్ లో డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్‌తో ఓ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాడట జూనియర్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న వినాయక్ ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మరి..

మరోసారి మాస్ అవతారం ఎత్తబోతున్న యంగ్ టైగర్ ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తాడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com