హూరా ప్రాంతంలో తగలబడిన కారు
- February 22, 2017
మనామా: హూరాలోని నేషనాలిటీ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ) భవనం సమీపంలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే ముందుగా కారులో పొగ వాసనను గమనించిన డ్రైవర్, చాకచక్యంగా ఆ కారు నుంచి బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం గురించి సమాచారం అందగానే సివిల్ డిఫెన్స్, అక్కడికి చేరుకుని కారుకి అంటుకున్న మంటల్ని అదుపు చేసింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్విట్టర్లో వెల్లడించింది. ఇరవై నాలుగ్గంటల వ్యవధిలో ఇది మూడో అగ్ని ప్రమాదం. నిన్ననే ఓ స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ముహైర్లోని గ్యాస్ స్టేషన్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనల్లో ఎవరూ మృతి చెందకపోవడం, గాయపడకపోవడం గమనించదగ్గది.
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







