రియాద్ లో మాజీ భర్త చెర నుంచి ఒక మహిళను రక్షించిన పోలీసులు
- February 23, 2017
జెడ్డా : చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ...కఠిన శిక్షలు అమలవుతున్నప్పటికీ పురుషాధిక్యతను కొందరు మృగాళ్లు తమ హింసాధోరణి వీడటం లేదు..మాజీ భర్త చెర నుంచి మహిళని విడిపించడానికి పోలీసులకు ఓ చిన్నసైజ్ యుద్ధం చేయాల్సి వచ్చింది. రియాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజధాని పశ్చిమాన నివాస భవనంలో సౌదీలో నివసిస్తున్న ఒక వ్యక్తి తన నుంచి విడాకులు తీసుకుని దూరంగా తన బతుకు తానూ బతుకుతున్న తన మాజీ భార్యని ఆమె కూతురిని వారింట్లోనే ఆ సైకో భర్త బంధించాడు. వాళ్లింట్లో పనిచేస్తున్న పనిమనిషిని సైతం వారితోపాటు బంధించాడు. ఒక తుపాకీని, కొన్ని బుల్లెట్లను తనవెంట తెచ్చుకుని వారిని భయపెడుతూ, వారిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటి ప్రధాన ద్వారం దగ్గరే కూర్చోన్నాడు. అతను ఎంతకీ వారి ఇంటి ముందు నుంచి కదలకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తన నలభై ఏళ్ళ వయస్సులో మాజీ భర్తనుంచి విడాకులు తీసుకున్నానని కానీ, ఇప్పుడు హఠాత్తుగా ఎందుకిలా మమల్ని బాధపెట్టాలనుకున్నాడో అర్థం కావడంలేదని తమను అతడి బారీనుంచి రక్షించాలని ఆమె పోలీసులను కోరింది. దాంతో పోలీసులు స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి, వారిని రక్షించడానికి వారి ఇంటిని చుట్టుముట్టారు. అయితే నిందితుడు తలుపు దగ్గరే కూర్చోని ఉండటం వల్ల పోలీసుల రాకను గుర్తుపట్టి వారిపై కాల్పులు జరపడం ప్రారంభించాడు. అంతేకాక భవనం లోపల ఒక రక్షణ ప్రదేశం లోనికి వెళ్ళిపోయాడు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు సివిల్ డిఫెన్సె దళం సహాయంతో ఆ భవనం పైకి చేరుకొని ..ఇంటి పై కప్పుని పగలగొట్టి పోలీసులు చాకచక్యంగా ఆ వ్యక్తిని బంధించారు. ఈ ఆపరేషన్ లో ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. కాగా దొరికిన నిందితుని వద్ద ఉన్న ఆటోమేటిక్ తుపాకీ , హ్యాండ్ గన్ లను స్వాధీనం చేసుకొన్నారు. బాధితులను అతని చెర నుంచి విడిపించారు. సైకో మాజీ భర్తని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







