రోడ్లపై ప్రమాదకర స్టంట్స్‌: క్లీనింగ్‌ శిక్ష

- February 24, 2017 , by Maagulf
రోడ్లపై ప్రమాదకర స్టంట్స్‌: క్లీనింగ్‌ శిక్ష

వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, రోడ్లపై ప్రమాదకరమైన స్టంట్స్‌ చేసే వాహనదారులకు శిక్ష విషయమై ఆర్డర్స్‌ని పాస్‌ చేశారు. ఈ ఆర్డర్‌ ప్రకారం, ప్రమాదకరమైన స్టంట్స్‌ చేసేవారికి రోడ్లను క్లీన్‌ చేసే పని అప్పగించడమే ఆ శిక్ష. రోజూ నాలుగు గంటల పాటు, 30 రోజులపాటు కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా వారితో ఈ పనులు చేయిస్తారు. రోడ్లపై ప్రమాదకరమైన స్టంట్స్‌ చేసేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోమని అధికారులు చెప్పారు. వెంటనే అలాంటివారిని అరెస్ట్‌ చేయడంతోపాటు, వారితో కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా పలు సేవలు చేయిస్తామని స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com