తీవ్రవాద పేలుడు కారణంగా బహ్రెయిన్ మహిళకు గాయాలు

- February 24, 2017 , by Maagulf
తీవ్రవాద పేలుడు కారణంగా బహ్రెయిన్ మహిళకు గాయాలు

గత రాత్రి జరిగిన తీవ్రవాద పేలుడు కారణంగా ఓ మహిళ ఒక మోస్తరుగా గాయపడ్డారు. మనామా పశ్చిమ ప్రాంతమైన సానబిస్ గ్రామంలో గురువారం రాత్రి జరిగిన పేలుడులో ఆ మహిళ గాయపడిందని, ఆ వెనువెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియరాలేదు. ఆ పేలుడుకి తాము బాధ్యులమని ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. జరుగుతున్న పలు సంఘటనలు మెజారిటీ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని అత్యధిక దాడులు జరుగుతున్నాయని, గత రాత్రి జరిగిన ఈ సంఘటన రెండవదని పదిరోజుల క్రితం ఫిబ్రవరి 14 వ తేదీన జరిగిన దాడిలో  సిత్ర  ద్వీపంకు చెందిన  ఇరువురు పౌరులు గాయపడ్డారని పేర్కొన్నారు. దీనికి ముందు జనవరి 20 వ తేదీన జరిగిన మరొక ఘటనలో  పౌరులను లక్ష్యంగా చేసుకొని సార్ ప్రాంతంలో ఒక ఖాళీ వాహనం పేల్చేందుకు పధకం సిద్ధం చేసుకొన్నారని తెలుస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com