మౌన ప్రదర్శన ప్రవాసాంధ్రుల

- February 27, 2017 , by Maagulf
మౌన ప్రదర్శన ప్రవాసాంధ్రుల

హూస్టన్‌, గుంటూరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): 'విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వం.. శాంతిని ప్రేమిస్తాం..ఒకరికొకరుగా ఉంటే నిలబడతాం.. విడిపోతే కూలిపోతాం' అన్న నినాదాలతో కాన్సస్‌ నగరం దద్దరిల్లింది. జాతివివక్షకు బలైన కూచిభొట్ల శ్రీనివా్‌సకు నివాళిగా.. అక్కడి భారతీయులు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్‌ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, కాబోయే అధ్యక్షుడు సతీష్‌ వేమన బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలు తెలుగు సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జంపాల చౌదరి మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు మనోధైర్యంతో ఉండాలని సమస్యలు తాత్కాలికమేనని అన్నారు.
కాగా.. ప్యూరిన్టన్‌ కాల్పుల్లో గాయపడి కోలుకుంటున్న అలోక్‌రెడ్డి కుటుంబ సభ్యులను తానా ప్రతినిధులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్‌, కాల్పుల్లో గాయపడిన అలోక్‌ మిత్రులు, కాన్సస్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌, ఒలాతే మేయర్‌, పోలీస్‌ చీఫ్‌ తదితరులు మాట్లాడారు. అలోక్‌ మాట్లాడుతూ శ్రీనివా్‌సతో తనది తొమ్మిదేళ్ల స్నేహమని చెప్పారు.

ఈ తొమ్మిదేళ్లలో ఒక్కసారికూడా అతడి నోటి వెంట నిర్లక్ష్యపూరిత మాటలు తాను వినలేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com