బహరేన్ లో బస్సు లక్ష్యంగా బాంబు దాడి గాయపడిన ఐదుగురు పోలీసు అధికారులు

- February 28, 2017 , by Maagulf
బహరేన్ లో బస్సు లక్ష్యంగా బాంబు దాడి  గాయపడిన ఐదుగురు పోలీసు అధికారులు

దుబాయ్ : బస్సు లక్ష్యంగా ఐలాండ్ నేషన్ లో బాంబు దాడి జరగ్గా ఆ ఘటనలో ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారని బహరేన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి  స్థిరమైన రీతిలో ఉందని అంతర్గత మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మతపెద్ద  షేక్ ఇసా ఖ్అస్సిమ్ సోమవారం కోర్టుకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఒకరోజు ముందుగా ఆదివారం ఈ దాడి పోలీసులపై జరిగింది. గత ఏడాది  జూన్ లో ఆ మతపెద్ద తన పౌరసత్వం కోల్పోయారు. అంతే కాకుండా దేశము నుండి బహిష్కరణకు సైతం గురయ్యారు. మతపెద్ద ఖ్అస్సిమ్ యొక్క తదుపరి విచారణ మార్చి 14 వ తేదీన జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com