మరో వివాదంలో నటుడు ప్రకాష్‌రాజ్‌

- March 01, 2017 , by Maagulf
మరో వివాదంలో నటుడు ప్రకాష్‌రాజ్‌

నిత్యం ఏదో ఒక వివాదంలో వుండే సీనియర్‌ నటుడు ప్రకాష్‌రాజ్‌.. తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువయ్యారు. తనతో సెల్ఫీ తీసుకునేందుకు దగ్గరకు వచ్చిన అభిమాని సెల్‌ఫోన్ పగులగొట్టి విమర్శల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం వేకువజామున చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ప్రకాష్‌రాజ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. అందులో బెంగళూరుకు చెందిన ఓ అభిమాని కొంచెం దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకోబోయాడు. అంతే! ఒక్కసారిగా సహనం కోల్పోయిన ప్రకాష్‌రాజ్‌.. అతని మొబైల్‌ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టడంతో అది ముక్కలైంది. ప్రకాష్‌రాజ్‌ ప్రవర్తనకు అభిమానులంతా దిగ్ర్భాంతి చెందారు. ఆయనతో వాగ్వివాదానికి దిగేలోపే ప్రకాష్‌రాజ్‌ విసవిసా నడుస్తూ తన కారెక్కి వెళ్లిపోయారు. దీని గురించి సదరు అభిమాని విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com