ఇక్కడ షోరూం బండ్లేవీ లేవు.. అన్నీ సెకండ్ హ్యాండ్ బండ్లే.

- March 02, 2017 , by Maagulf
ఇక్కడ షోరూం బండ్లేవీ లేవు.. అన్నీ సెకండ్ హ్యాండ్ బండ్లే.

పూరీ మార్క్ రొమాన్స్.. పూరీ మార్క్ హీరోయిజం.. పూరీ మార్క్ టేకింగ్... మొత్తంగా రోగ్ ట్రైలర్ మాత్రం రొటీన్‌గా ఉన్నా ఫర్వాలేదనిపించింది. పూరీ మార్క్ డైలాగులు రోగ్‌లో ఉన్నాయి. హీరోయిజాన్ని తన స్టైల్లో చూపించాలంటే.. దానికి తగినంత విలనిజం ఉండాలి. అందుకే అనూప్ సింగ్‌ను సైకోగా పరిచయం చేస్తున్నాడు. బ్యాంకాక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథలో హీరో యాటిట్యూడ్‌ను.. పది రూపాయలిస్తే ఏమైనా చేసే యువకుడిగా చూపిస్తున్నాడు. హీరో ఆటో డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. కొత్త కుర్రాడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. తెలుగులో నాలుగైదు సినిమాలు చేసిన మన్నారా చోప్రా, ఏంజెలా క్రిసిలింకీలు హీరోయిన్లు. ఎంత హీరోయిజం, విలనిజం చూపించాడో..
హీరోయిన్ల గ్లామర్‌ను అంతేలా వాడేసుకున్నాడు. ఇడియట్‌తో చంటిగాడి ప్రేమకథను పరిచయం చేసిన పూరీ.. రోగ్‌తో మరో చంటిగాడి ప్రేమకథ అంటూ తీసిన ఈ సినిమా ట్రైలర్ రొటీన్‌గానే ఉన్నా సినిమాతోనైనా బంపర్ హిట్ కొడతాడేమో చూడాలి. పూరీ మార్క్ డైలాగ్ ఒకటి చెప్పుకొంటే..

ఇక్కడ షోరూం బండ్లేవీ లేవు.. అన్నీ సెకండ్ హ్యాండ్ బండ్లే. ఇలాంటి డైలాగులకు సినిమాలో కొదవ ఏమీ ఉండబోదేమో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com