గుజరాత్ హోం మంత్రిపై చెప్పుతో దాడి

- March 02, 2017 , by Maagulf
గుజరాత్ హోం మంత్రిపై చెప్పుతో దాడి

గుజరాత్ హోం మంత్రిపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. అసెంబ్లీ ఆవరణలో హోం మంత్రి ప్రదీప్‌జడేజా మీడియాతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఓ అంగంతకుడు చెప్పు విసిరారు. అయితే ఆ యువకుడు విసిరిన చెప్పు మంత్రికి తగలకుండా ఆయన సెక్యూరిటీ సిబ్బందికి తగిలింది. చెప్పు విసిరిన వ్యక్తిని గోపాల్ ఇటాలియాగా గుర్తించారు. మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా హోంమంత్రి పట్టించుకోలేదని గోపాల్ ఆరోపించారు. దాడికి పాల్పడిన గోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com