తన ఆస్తి కొడుకు, కూతురుకి సమానమేనంటున్న అమితాబ్

- March 03, 2017 , by Maagulf
తన ఆస్తి కొడుకు, కూతురుకి సమానమేనంటున్న అమితాబ్

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ పలు సామాజిక కార్యక్రమాలపై.. సమాజంలో జరుగుతున్న అన్యాయం పై.. ముఖ్యంగా మహిళల పట్ల మన దేశంలో చోటు చేసుకొంటున్న వివక్షతపై స్పందిస్తూనే ఉంటారు.. మహిళలు మగవారితో సమానమే అంటూ బిగ్ బీ అమితాబ్ స్టేట్ మెంట్స్ ఇచ్చిన ఆయన ఆసక్తి కరమైన ట్వీట్ చేశారు.. తన మరణానంతరం తనకు చెందిన ఆస్తులు కొడుకు, కూతురు కి సమానంగా చెబుతాయని ఓ పేపర్ ని పట్టుకోని ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. కాగా గతంలో కూడా ఆడ మగ వివక్షత విషయంలో స్పందించిన అమితాబ్... తన మానవరాలి డ్రెస్ విషయంలో విమర్శలకు సమాధానం ఇస్తూ.. మా స్టార్ డమ్ మీ స్వేచ్ఛకు అడ్డురాదు... నచ్చినట్లు ఉండమని మానవరాలికి ఓ లేఖను రాసిన సంగతి విధితమే.. కాగా కొడుకు వేరు కూతురు వేరు అని చూసే తల్లిదండ్రులు అమితాబ్ తీసుకొన్న నిర్ణయాన్ని చూసి ఆలోచించాలని.. వ్యాఖ్యానిస్తూనే... ఆస్తుల పంపకం విషయంలో తీసుకొన్న నిర్ణయం పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com