కుటుంబాల్ని వెనక్కి పంపుతున్న వలసదారులు
- March 03, 2017
పెద్ద సంఖ్యలో వలసదారులు, తమ కుటుంబ సభ్యుల్ని కువైట్ నుంచి స్వదేశాలకు పంపించేయడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దానికి ప్రదాన కారణం 'కాస్ట్ ఆఫ్ లివింగ్' పెరిగిపోతుండడమే. సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న హని అబు ఖత్తామ్ మాట్లాడుతూ, తాను నెలకు 600 కువైట్ దినార్స్ సంపాదిస్తాననీ, కుటుంబాన్ని ఇక్కడే ఉంచి ఆ మొత్తంతో జీవనం గడపలేను గనుక, ఇక్కడే బ్యాచిలర్‌గా ఉండటానికి నిర్ణయించుకుని, కుటుంబాన్ని ఇండియాకి పంపించేసినట్లు చెప్పారు. 500 కువైటీ దినార్స్ జీతనం సంపాదిస్తోన్న ముస్తపా అత్తియా మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో కలిసి నివసించడానికి కేవలం రెంట్ రూపంలోనే 280 కువైటీ దినార్స్ చెల్లించవలసి వస్తోందని అందుకే 40 కువైటీ దినార్స్‌తో బ్యాచిలర్‌గా ఉంటూ, కుటుంబాన్ని తనకు దూరంగా ఇండియాలో ఉంచానని వివరించారు. కువైట్‌లో కుటుంబంతో కలిసి సాధారణ జీవనం గడపాలంటే 700 కువైటీ దినార్స్ కన్నా ఎక్కువే ఆర్జించవలసి ఉంటుందని అబు కరీమ్ అనే ఇంకో వ్యక్తి చెప్పారు. ఇంకో వైపున టీచర్లుగా పనిచేస్తున్నవారూ కువైట్‌లో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వారిపై తొలగింపు నిర్ణయాలతో కాంట్రాక్టులు పునరుద్ధరణ కాక, ఇంటిదారి పడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









