విలన్‌గా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నిర్మాత

- March 04, 2017 , by Maagulf
విలన్‌గా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నిర్మాత

తెలుగు, తమిళ చిత్రాలను నిర్మంచిన రాక్‌లైన్ వెంకటేష్ విలన్‌గా రానున్నారు. 'లింగ' నష్టాల వ్యవహారంలో పంపిణీదారులు విలన్‌గా భావించిన నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌ నిజంగానే విలన్‌గా మారారు. బాలా తెరకెక్కిస్తున్న 'నాచ్చియార్‌' చిత్రంలో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. బాలా చిత్రాలను మొదటి నుంచి పరిశీలిస్తే విలన్ పాత్రధారులు దాదాపుగా నిర్మాతలే అయి ఉంటారు. 'నాన్ కడవుళ్‌'లో నిర్మాత అళగన్ తమిళ్‌ మణి, 'పరదేశి'లో నిర్మాత జేడి, 'తారా తప్పట్టై'లో నిర్మాత ఆర్‌కే సురేష్‌లను విలన్లుగా మార్చారు. ఆ జాబితాలో ఇప్పుడు 'లింగ' నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌ను కూడా చేర్చారన్న మాట.
జ్యోతిక, జీవీ ప్రకాష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'నాచ్చియార్‌' షూటింగ్‌ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com