సెట్స్ పైకి వెళ్లడానికి ముస్తాబవుతున్న ఎన్టీఆర్

- March 05, 2017 , by Maagulf
సెట్స్ పైకి వెళ్లడానికి ముస్తాబవుతున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్  త్రిపాత్రాభినయంతో బాబీ తెరకెక్కికస్తున్న సినిమా స్టార్ట్ అయింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు రెండో షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది.  ఐతే ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. 

ఎన్టీఆర్  ఈ నెల 9వ తేదీ నుంచి  సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఎన్టీఆర్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్న ఈ సినిమాకి, 'జై లవ కుశ' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో, ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com