'ఫ్లిప్‌కార్ట్' నుంచి శుభవార్త

- March 05, 2017 , by Maagulf
'ఫ్లిప్‌కార్ట్' నుంచి శుభవార్త

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం అధికంగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సీవోవో నితిన్ సేథీ తెలిపారు. పోటీ సంస్థ స్నాప్‌డీల్ ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తుంటే ఫ్లిప్‌కార్ట్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తుండడం గమనార్హం. మార్కెట్లో తనకు ప్రధాన పోటీగా ఉన్న అమెజాన్‌ను మరింత దీటుగా ఎదుర్కొనే ఉద్దేశంలో భాగంగానే ఉద్యోగులను పెంచుతున్నట్టు సమాచారం. ఉద్యోగుల సంఖ్యను పెంచి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంస్థను విస్తరిస్తామని నితిన్ వివరించారు. గతేడాది ఫ్లిప్‌కార్ట్ 1500 మంది ఉద్యోగులను తీసుకుంది.

ప్రస్తుతం ఈ సంస్థలో పదివేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు మరో 30 శాతం మందిని తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com