తేలికపాటి జల్లులు, బలమైన గాలులతో నేటి వాతావరణం ఉండవచ్చని అంచనా
- March 05, 2017
దోహా : సోమవారం (నేడు ) కొన్ని ప్రదేశాల్లో పగటి సమయంలో వర్షంతో కూడిన తేలికపాటి జల్లులు బలమైన గాలులతో కూడిన వాతావరణం ఉండొచ్చని కతర్ వాతావరణ శాఖ తన సూచన తెలిపింది.సముద్ర తీర ప్రాంతాల్లో సైతం బలమైన గాలులు వీచే అవకాశముందని సోమవారం ఈ పరిస్థితి గమనించవచ్చు.కొన్ని చోట్ల బలమైన ఈదురు గాలులు వీయడంతో పాటు గాలివేగం 25 నాట్ల వరకు ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పరిస్థితికి చేరుకోవచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో గాలి వేగం 28 నాట్ల వేగంతో వీయడంతో పాటు అదే సమయాల్లో సముద్ర మట్టం10 అడుగుల ఎత్తు మేరకు పెరుగుతుందని పేర్కొంటున్నారు.తాజావర్షపు జోరు కతర్ లో గత గురువారం నుండి ప్రారంభమై సోమవారం ఉదయంవరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ భావిస్తుంది. దేశంలో గత కొన్నిరోజులుగా" అస్థిరత్వంతో కూడిన ఒక వాతావరణ పరిస్థితి " అందుకు అనుగుణంగా ప్రభావితం కాబడిన ఫలితం ఇది. అలాగే, దేశంలో గత నెల రోజులుగా అస్థిర వాతావరణం మరియు వర్షం రెండు విధాలుగా కొనసాగుతుంది. వాతావరణ పరిస్థితిని తెలిపే రువాయ్స్ పటాల ప్రకారం ఉత్తర కతర్ లో గురువారం మరియు ఆదివారం ప్రొద్దున లోపు12.5 మిల్లి మీటర్లతో కూడిన అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ తరువాత స్థానం శీహానియా ప్రాంతాల్లో 6.6 మిల్లి మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ నేపథ్యంలో, వివరణాత్మక సూచన ప్రకారం సోమవారం వాతావరణం పాక్షికంగా ఆకాశం మేఘావృతం కాబడి ఉంటుంది. ఆ రోజు వేకువజామున చెదురుమదురుగా వర్షం వచ్చే సూచన ఉందని తెలిపారు.పగటిపూట మందపాటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. అది రాత్రి సాపేక్షంగావాతావరణం చల్లగా ఉంటుంది. మబ్బుగా మరియు అప్పుడప్పుడు మేఘాలు అలుముకొని పరిస్థితులు ఏర్పడి వద్ద చెల్లాచెదురుగా వర్షం సముద్ర తీరాల్లో కురిసే అవకాశముందని సూచన చేశారు. అలాగే, ఆ తర్వాత కొంత మేరకు దుమ్ము రేగే అవకాశం ఉంది. నేడు వ్యాకరహ్ లో15 సెల్సియస్ కనీస కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాబడి అవకాశం ఉంది. అదేవిధంగా మెసయిద్ , అబూ సామ్రా మరియు అల్ ఖోర్ దోహాలో 18 సెల్సియస్ కనీస కనిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది, అయితే, మరోవైపున ఉంది. గరిష్ట, మరోవైపు, 21సెల్సియస్ నుండి 25 సెల్సియస్ మధ్య కనీస కనిష్ట ఉష్ణోగ్రత ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఆదివారం తురైనా, కరణ మరియు ఘువైరియా ప్రాంతంలో16 సెల్సియస్ కనీస కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, దోహా విమానాశ్రయంలో19 సెల్సియస్ కనీస కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రత 21 సెల్సియస్ నుండి 29 సెల్సియస్ వరకు నమోదు కాబడింది.
వర్షంనీరు తొలగింపు
వర్షపాతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తాజాగా కురిసిన 2.5 మిలియన్ల గ్యాలన్ల వర్షం నీటిని వివిధ మున్సిపాలిటీలలో అత్యవసర జట్లు సక్రమంగా డ్రైన్లలోనికి ప్రవహించేలా 627 జట్లు వంతుల వారీగా 276 మంది ఉద్యోగులు మరియు కార్మికులు 83 ట్యాంకర్ల సహాయంతో నీటి మల్లింపు పనిలో నిమగ్నమై ఆయా పనిని సమర్ధవంతంగా నిర్వహించింది.
తాజా వార్తలు
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్







