అభిమాన సంఘాలతో కమల్‌ ఆకస్మిక భేటీ

- March 05, 2017 , by Maagulf
అభిమాన సంఘాలతో కమల్‌ ఆకస్మిక భేటీ

ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన తన అభిమాన సంఘాల నాయకులు, న్యాయవాదులతో ఆదివారం ఆకస్మికంగా భేటీ అయ్యారు. ఈ పరిణామం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో కమల్‌హాసన తన ట్విట్టర్‌లో చేసిన రాజకీయపరమైన ప్రకటనలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. స్థానిక ఆళ్వార్‌పేటలోని ఆయన నివాసానికి రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులు, అభిమాన సంఘాల్లో సభ్యులుగా ఉన్న న్యాయవాదులు చేరుకున్నారు. అయితే అభిమాన సంఘాలు ఈ భేటీపై నోరు మెదపలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com