రెండో పెద్ద ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ప్రారంభించిన చైనా
- March 06, 2017
భారత సరిహద్దులో రెండో అతి పెద్ద ఎయిర్ పోర్టు టెర్మినల్‌ను చైనా సోమవారం ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలోని టిబెట్‌లో దీన్ని నిర్మించింది. ఆ ఎయిర్‌పోర్టులో ఇది ఆరో టెర్మినల్. సముద్ర మట్టానికి 2950 మీటర్ల ఎత్తులో 10,300 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ఈ ఎయిర్ పోర్టు 2006లో ప్రారంభమైంది.
2016 నాటికి ఈ ఎయిర్ పోర్టు సుమారు నాలుగు లక్షల ప్రయాణికులకు సేవలందించింది. 2020 నాటికి ఏడున్నర లక్షల ప్రయాణికులతో పాటు మూడు వేల టన్నుల సామాగ్రిని రవాణా చేసేలా చైనా దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఆ దేశంలోని ప్రధాన నగరాల నుంచి టిబెట్‌కు విమాన సర్వీసులు నడుపుతోంది. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలను మోహరించేలా దీన్ని తీర్చిదిద్దింది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి