బహ్రెయిన్ కి అరబ్ దేశాల ప్రశంస
- September 23, 2015
తమ హక్కుల కోసం, న్యాయం కోసం పాటుపడ్తున్న బహ్రెయిన్‌ని అరబ్ దేశాలు ప్రశంసించాయి. అంతర్జాతీయ వేదికలపై బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా చొరవనూ, వాస్తవిక పరిస్థితుల్ని ఆయన అధ్యయనం చేసి, ముందు చూపుతో వ్యవహరించే విధానాన్నీ, అరబ్ దేశాల ఐక్యత కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల్నీ వారంతా అభినందించారు. కువైట్ రాయబారి, దౌత్య అధికారి షేక్ అజామ్ ముబారక్ తదితరులు ఈ ప్రతినిథి బృందానికి నాయకత్వం వహించారు. విభేదాలు పక్కన పెట్టి అందరం ఒక్కతాటిపైకి వస్తే అరబ్ దేశాలు తమ హక్కుల్ని కాపాడుకోగలవని ప్రీమియర్ అభిప్రాయపడ్డారు. పాలస్తీనాకు అరబ్ దేశాల మద్దతు కొనసాగుతుందనీ, దాంతోపాటుగా అరబ్ దేశాల అంతర్గత సమస్యలపైనా దృష్టిపెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అరబ్ దేశాల ఐక్యతను దెబ్బ తీసేలా యెమెన్‌లో అరాచక శక్తులు పెచ్చుమీరుతున్నాయనీ, వాటిని అరబ్ దేశాలు ఐక్యంగా తిప్పి కొట్టాలన్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









