ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలి

- March 07, 2017 , by Maagulf
ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలి

ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత అధ్యక్షుడు గంగు భానుమూర్తి సహా పలువురు సిద్ధాంతులు సూచించారు. హైదరాబాద్‌ నల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతీ దేవాలయంలో గంగు భానుమూర్తి ఆధ్వర్యంలో దృక్‌, పూర్వగణిత పంచాంగ కర్తల సదస్సు మంగళవారం జరిగింది. శ్రీనివాస వాగ్ధేయ సిద్ధాంతి సమన్వయకర్తగా వ్యవ హరించగా.. తెలంగాణ బ్రాహ్మణ పరిషత ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణరావు, పలువరు సిద్ధాంతులు పాల్గొన్నారు. కాగా, ఉగాదిని 29వ తేదీన జరుపుకోవాలని ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి కూడా సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com