బాలుడిని వర్షంలో పాఠశాల బయటకు పంపిన సూపర్వైజర్ పై చర్యలు
- March 08, 2017
మనామా: 'తగిన' దుస్తులు ధరించనందుకు స్కూల్ నుండి ఒక విద్యార్థిని వర్షంలో వెలుపలకు పంపించడంపై విద్య మంత్రిత్వ శాఖ మంగళవారం మండిపడింది. దానికి కారణమైన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పర్యవేక్షకుడిపై చర్యలు తీసుకొన్నారు. ఈ విషయాన్ని తెలియచేసే దృశ్య వీడియో స్థానిక సామాజిక మీడియాలోవ్యాపించింది. ఆ వీడియో లో, ఇసా టౌన్ సమీపంలో విద్య ఏరియాలో షేక్ అబ్దుల్లా బిన్ ఇసా సెకండరీ సాంకేతిక బోయ్స్ స్కూల్ నుండి తన కుమారుడిని " తరగతి నుండి బైటకు పంపి వర్షంలో నుంచోబెట్టి తరిమివేయడంపై ఆ పిల్లవాని అరబ్ గురువు, గురించి ఒక బహ్రేయినీ తల్లి ఫిర్యాదు చేశారు.తన కొడుకు ఇది సాంకేతిక పాఠశాలల్లో ఆచరణాత్మక తరగతులు జరుగుతున్న సమయంలో ధరించే ఒక జంప్ సూట్ వేసుకొని ఉండకపోవడంతో పాఠశాల వదిలివెళ్ళమని అడిగారు. ఆ వీడియోలో ఆమె కుమారుడు వర్షం లో నిలబడి గురువుని ప్రాధేయపడుతున్న దృశ్యం పలువురిని బాధించింది. ఆ ఉపాధ్యాయుడు ఆ బాలుడ్ని పాఠశాల వదిలి వెళ్ళమని గ్డధించాడు ఆ తరువాత బాలుడు వెళ్ళిపోయాడు. దీనితో ఆ తల్లి, విద్య మంత్రి డాక్టర్ మాజిద్ అల్ నురిమికి పిర్యాదు చేశారు.దీనికి ప్రతిస్పందనగా, విద్య మంత్రిత్వశాఖ పాఠశాలలో పని చేస్తున్న సూపర్వైజర్ తన విధుల నుండి తొలగిస్తూ ఒక పత్రికా ప్రకటన చేశారు. ఇదే విషయాన్ని ఆ పాఠశాల యొక్క నిర్వాహకుడు పబ్లిక్ రిలేషన్స్ మరియు మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ సోమవారం ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







