'బ్లాక్‌మనీ' .. అన్నీ కొత్త నోట్లే' కొత్త సినిమా
- March 08, 2017
'జనతాగ్యారేజ్', 'మన్యం పులి' సినిమాలతో తెలుగులోనూ అభిమానులను సాధించుకున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన హీరోగా ఏ సినిమా వస్తోంది అన్న క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో కాస్త ఎక్కువగానే ఉంది.. ఆ క్యూరియాసిటీని మరింత రెయిజ్ చేసేలా, ఆద్యంతం థ్రిల్‌కి గురిచేసే మరో మైండ్ బ్లోవింగ్ మూవీ మోహన్‌లాల్ నుంచి వస్తోంది. ఈ సినిమా టైటిల్ 'బ్లాక్‌మనీ'. '.. అన్నీ కొత్త నోట్లే' అన్నది ఉపశీర్షిక. నిజామ్ సమర్పణలో మాజిన్ వీమేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈనెలలోనే సినిమా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -"మోహన్‌లాల్ నటించిన ఈ క్రేజీ సినిమాకి ప్రస్తుతం అనువాదం జరుగుతోంది. వెన్నెలకంటి సంభాషణలు అందించారు. ఇప్పటికే సెన్సార్ పనులు సాగుతున్న ఈ చిత్రాన్ని ఈనెలలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సీనియర్ దర్శకుడు జోషి ఈ సినిమాని అద్భుతమైన గ్రిప్‌తో తెరకెక్కించారు. డీమానిటైజేషన్ తర్వాత అన్నిచోట్లా బ్లాక్‌మనీ గురించే చర్చ సాగుతోంది. ఎప్పటికప్పుడు నల్లదొరలు కొత్త కరెన్సీతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజవుతోంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది. ష్యూర్‌షాట్ హిట్" అన్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ సరసన అమలాపాల్ కథానాయికగా నటించగా, సాయికుమార్ విలన్‌గా నటించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!