ఎమిరేట్స్ ఐడీ - హెల్త్ ఇన్స్యూరెన్స్
- March 08, 2017
ఎమిరేట్స్ ఐడీ క్రమంగా మల్టీ పర్పస్ ట్రాన్సాక్షన్స్ కోసం వినియోగించే కార్డ్‌లా రూపాంతరం చెందుతోంది. మొదట్లో పర్సనల్ ఐడెంటిఫికేషన్ మరియు ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం నివాసితులకు ఎమిరేట్స్ ఐడీ కార్డ్ ఉపయోపడేది. దాన్ని ఇన్స్యూరెన్స్‌తో లింక్ చేయడం వల్ల ఇన్స్యూరెన్స్ కార్డ్‌గా కూడా వినియోగించబడ్తోంది. ఆరు ఇన్స్యూరెన్స్ కంపెనీలు దీనితో అనుసంధానమయ్యాయి. ఒకే కార్డ్‌తో అనేక ప్రయోజనాలు కల్గించడం వల్ల కన్ఫ్యూజన్కి ఆస్కారం తక్కువ ఉంటుందనీ, అలాగే అక్రమాలు చోటుచేసుకోకుండా ఉంటాయనీ, వినియోగదారులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఇన్స్యూరెన్స్ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. యుటిలిటీ బిల్స్ చెల్లింపులు, జరీమానాల చెల్లింపులు, వాహనాల రిజిస్ట్రేషన్, ఫోన్ కనెక్షన్స్, ఇంటర్నెట్ వినియోగం, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ వంటి అవసరాల కోసం కూడా వినియోగించడం జరుగుతోంది. ఎమిరేట్స్ ఐడీ క్రమక్రమంగా డెబిట్‌కార్డ్ తరహాలో వినియోగించేందుకూ కొన్ని బ్యాంకులు ముందుకొస్తున్నాయి.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!