దయీష్‌ మద్దతుదారుడి కాల్చివేత

- March 08, 2017 , by Maagulf
దయీష్‌ మద్దతుదారుడి కాల్చివేత

పోలీసు అధికారులు, రియాద్‌లో దయీష్‌ మద్దతుదారుడ్ని కాల్చి చంపారు. అల్‌ రయ్యాన్‌ డస్ట్రిక్ట్‌లోని ఓ ఫర్నిష్డ్‌ అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో పనిచేస్తున్న కార్మికుడు, తమ సహచరుడొకరు దయీష్‌ మద్దతుదారుడిగా ప్రకటించుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. అయితే నిందితుడు, పోలీసులపైకి పిస్తోల్‌ ఎక్కుపెట్టాడు. ఈ క్రమంలో అతన్ని కాల్చి చంపవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి మరో వ్యక్తి ఎస్కేప్‌ అయ్యేందుకు ప్రయత్నించగా అతన్ని అరెస్ట్‌ చేశారు. మొత్తం రెండు పిస్తోల్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com