గుండెపోటుతో ప్రవాస భారతీయుని మృతి

- March 08, 2017 , by Maagulf

సొంతవారిని ..జన్మభూమిని వదిలి బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన కొందరు తెలుగు తేజాల జీవితాలు మధ్యలోనే మసకబారుతున్నాయి. అధికమైన అంకితభావంతో ఆరోగ్యాలను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ఎడారి దేశాలలో నిరంతరం కష్టించి పని చేస్తుండటంతో ఆరోగ్యం పాడుచేసుకొని అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తమవారికి ఎంతో శోకాన్ని మిగుల్చుతున్నారు.రాస్ అల్ ఖైమః లో IT శాఖలో పనిచేస్తున్న శ్రీ కంబాల ఉమాశంకర ఏసు ప్రసాదరావు బుధవారం రాత్రి  8.45 సమయంలో తీవ్రమైన గుండెపోటు సంభవించడంతో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఇక్కడ నివసిస్తున్న ఆయనకు భార్య,ఏడాది వయస్సు కుమారుడు ఉన్నారు. వివాదరహితుడు..స్నేహశీలిగా మంచి పేరు తెచ్చుకొన్న శ్రీ కంబాల ఉమాశంకర ఏసు ప్రసాదరావు ఆకస్మిక  మరణ వార్త  పలువురుని  దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా,ఆయన భౌతికకాయాన్ని తన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ద్వారా తణుకు పట్టణంకు తరలించేందుకు తెలుగు తరంగిణి టీం అన్ని లాంఛనాలను పూర్తిచేస్తున్నారు. ఒబ్బిలిశెట్టి అనురాధ APNRT కో-ఆర్డినేటర్, కుదరవల్లి సుధాకర రావు APNRT కో-ఆర్డినేటర్, రాజశేఖర్ చప్పిడి - APNRT మీడియా కో-ఆర్డినేటర్ తమ సేవ సమన్వయంతో భారతదేశంలోని అంబులెన్స్ ద్వారా శ్రీ కంబాల ఉమాశంకర ఏసు ప్రసాదరావు పార్ధీవ దేహాన్ని ఆయన ఇంటికి పంపనున్నారు.మాగల్ఫ్ ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com