నేడు ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికలు
- March 08, 2017
ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్ధానాలకు జరగబోయే పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. బరిలో నిలిచిన అధికార టీడిపీ, ప్రతిపక్ష వైసిపీతో పాటు కాంగ్రెస్, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్ధుల భవితను ఓటర్లు నిర్ణయించనున్నారు. మూడు గ్రాడ్యుయేట్స్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్దానాలకు నేడు ఏపిలో పోలింగ్ జరగనుంది. అనంతపురం, కర్నూలు, కడప కలిపి ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గం కాగా... ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిపి మరోటి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు మరోటి. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల విషయానికి వస్తే అనంత, కర్నూలు, కడప జిల్లాలు ఒకటి. ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు ఒకటి. వీటన్నింటికి ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ జరగనున్న జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎన్నికల సామాగ్రిని ఇప్పటికే సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో భద్రతను కట్టుదిట్టం చేసారు.ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 240 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. అటు రాయలసీమలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్తూరు, అనంతపురం, సహా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసారు.కర్నూలు జిల్లా విషయానికొస్తే 177 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు.82వేల 591 పట్టభద్ర ఓటర్లు, 6వేల670 ఉపాధ్యాయ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 848మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికలు నిర్వహిస్తే , వెయ్యిమంది పోలీసులు భద్రతను చూసుకుంటారు. వెయ్యికి మించి ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో 5 యాక్జిలరీ సెంటర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు పోలింగ్ రోజు అభ్యర్థులు 3 వాహనాలు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ వాహనాల్లో ఓటర్లను తరలించకూడదని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్లు, పెన్ కెమెరాలు తీసుకురాకూడదని సూచించారు. ఇదిలా ఉంటే ఇన్ని రోజుల పాటు ప్రచారం నిర్వహించిన అభ్యర్ధుల్లో పోలింగ్ టెన్షన్ నెలకొంది. క్యాంపెయిన్లో ఓటర్లు అంతా బాగానే స్పందించినప్పటికి ఓట్లు ఎవరికి వేస్తారనే దానిపై టెన్షన్ నెలకొంది. మరి వీళ్లలో గెలుపు గుర్రాలెవరనేది 20వ తారీఖున తేలిపోనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు