పెళ్ళి వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుళ్ళు..

- March 09, 2017 , by Maagulf
పెళ్ళి వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుళ్ళు..

ఓ పెళ్ళి వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుళ్ళు జరిగాయి. 26 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇరాక్‌లోని సలాహుదిన్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బాంబులున్న జాకెట్లు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు పెళ్ళి వేడుకకు వచ్చి పేల్చేసుకున్నారు.
ఈ ఘటనలో 26 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో సూసైడ్ బాంబర్ వద్ద ఉన్న పేలుడు పదార్థాలు పొరపాటున పేలడంతో అతడు కూడా మృతి చెందినట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com