ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్‌కి నివాళి
- March 09, 2017
జెడ్డా: ఇండియన్ కల్చరల్ సొసైటీ (జెడ్డా), బజ్మ్ ఇ ఒస్మానియా - జెడ్డా 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ మొహమ్మద్ అయాజ్ మరియు నటుడు అక్బర్ సోలాపురి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ మొహమ్మద్ నూర్ రహ్మాన్ షేక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసిఎస్జె ప్యాట్రన్ దిల్షాద్ అహ్మద్ షమ్షి మాట్లాడుతూ, ఇండియా నేషనల్ డేని 40 ఏళ్ళుగా జెడ్డాలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇండియన్ కమ్యూనిటీ కోసం తాము పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివనీ, వారిని స్మరించుకున్నప్పుడే మన దేశ ఔన్నత్యాన్ని మనం గౌరవించుకున్నట్లవుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







