అరార్ లో ఆహారం కలుషితం కావడంతో 27 మంది విద్యార్ధులకు అస్వస్థత
- March 09, 2017
స్థానిక అరార్ లోని ఒక బాలుర పాఠశాల ఫలహారశాలలో ఆహారం కలుషితం కావడంతో బుధవారం మధ్యాహ్నం భోజనం తిన్న 27 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. విద్యార్థులను వైద్యం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రులకు తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అరార్ బాలుర పాఠశాలలో 27 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఫోన్ కాల్ అందుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరమైన స్థితిలో ఉందని వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు, మంత్రిత్వ శాఖ తెలిపింది.పాఠశాల జరుగుతున్ నసమయంలో ఫలహారశాలలో లభించే అరార్ బేకరీలలోని ఆహార పదార్ధాలను తిన్న విద్యార్థులకే ఈ ఇబ్బందులు తలెత్తాయి.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







