భద్రతాదళాలు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం..!
- March 09, 2017
జమ్ముకాశ్మీర్‌లో విధ్వంసానికి మిలిటెంట్ల ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. తాజాగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్‌లలో భద్రతాదళాలు ముగ్గురిని కాల్చి చంపాయి. మిలిటెంట్ల ఎదురుకాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందాడు. పుల్వామాలో హతమైన ఉగ్రవాదులను లష్కరేకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కాశ్మీర్ లోయలో తుపాకులు మరోసారి గర్జించాయి.. భద్రతాదళాలకు, ఉగ్రవాదులుకు మధ్య బీకరంగా కాల్పులు జరిగాయి జమ్ముకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని పడ్గాంపురా గ్రామంలో పక్కపక్కనే ఉన్న రెండిళ్లలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతాదళాలు వాటిని చుట్టుముట్టాయి. మిలిటెంట్లు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దాదాపు తొమ్మిది గంటలపాటు జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని లష్కరే తొయిబాకు చెందిన జహంగీర్ గనీ, మహ్మద్ షఫీ షీర్‌గుజ్రిగా అధికారులు గుర్తించారు. మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని తెలీడంతో. వారిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నించారు. లొంగిపోవాలని సూచించినా వినకపోవడంతో కాల్పులు జరిపారు. అటు నుంచి మిలిటెంట్లు కాల్పులు జరపడంతో.. ఒక 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కాల్పులు జరుగుతుండడంతో బనిహల్-శ్రీనగర్ మధ్య రైళ్ల రాకపోకలను అదికారులు తాత్కాలికంగా నిలిపేశారు. జమ్ముకాశ్మీర్‌లో జరిగిన మరో ఘటనలో మరో ఉగ్రవాదిని భద్రతాదళం కాల్చి చంపింది. బండిపురా నుంచి ముస్తాక్ అహ్మద్ షీర్‌గుజ్రి అనే మిలిటెంట్ వెళ్తున్నట్టు తెలుసుకున్న భద్రతా బలగాలు.. ఒక క్యాబ్‌లోంచి కాల్పులు జరిపిన ఉగ్రవాదిని హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇటు జమ్మూలో పూంచ్ సెక్టార్‌లో ఉన్న భారత పోస్టులపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గాయపడ్డ ఒక జవాన్ మృతి చెందాడు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







