జర్మనీ రైల్వే స్టేషన్‌లో గొడ్డలితో దాడి..ఏడుగురుకి గాయాలు

- March 09, 2017 , by Maagulf
జర్మనీ  రైల్వే స్టేషన్‌లో  గొడ్డలితో దాడి..ఏడుగురుకి గాయాలు

 విదేశాల్లో వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఓపక్క అమెరికాలో జాతి విద్వేశంతో తెల్ల జాతి దుండగులు కాల్పులతో రెచ్చిపోతుండగా జర్మనీలో ఓ వ్యక్తి గొడ్డలితో రాక్షసంగా ప్రవర్తించాడు. ఓ రైల్వే స్టేషన్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా దొరికిన ప్రతి ఒక్కరిని నరకడం మొదలుపెట్టాడు. దీంతో దాదాపు ఏడుగురు గాయాలపాలయ్యారు. జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఇలాంటి దాడులు ఇక్కడ జరుగగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గురువారం రాత్రి యుగోస్లావియాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ 36 ఏళ్ల వ్యక్తి మానసికంగా బాధపడుతున్నాడు.
అతడు అనూహ్యంగా గొడ్డలి తీసుకొని రాత్రి 8.50గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెట్టి గొడ్డలితో తీవ్రంగా దాడికి చేశాడు. పోలీసులు అక్కడి చేరుకోవడంతో అతడు పారిపోయేందుకు ఓ పెద్ద గోడ నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. 

పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం అతడిని విచారించే పరిస్థితిల్లో లేడని, మానసికంగా దెబ్బతిని ఉన్నాడని మాత్రం తమకు అర్ధం అయిందని చెప్పారు. ఈ ఘటన కారణంగా స్టేషన్‌ ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందని, ఎక్కడికక్కడా ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయిందని అన్నారు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణం ఎక్కడ చూసిన రక్తపు మరకలతో దర్శనం ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com