ప్రముఖ హీరో తల్లి సింగర్‌గా ఎంట్రీ

- March 09, 2017 , by Maagulf
ప్రముఖ హీరో తల్లి సింగర్‌గా ఎంట్రీ

టి.రాజేందర్‌ వారసుడిగా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నాడు శింబు. నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కూడా. గతేడాది అతని సోదరుడు కురలరసన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఇప్పుడు శింబు కూడా స్వరకర్తగా మారారు. అంతేకాదు, తన తొలి ఆల్బమ్‌లో తల్లిదండ్రులిద్దరి చేత పాట పాడించడం విశేషం. టి.రాజేందర్‌ ఇదివరకు అనేక చిత్రాల్లో పాటలు పాడడం అందరికీ తెలిసిందే. అయితే తొలిసారి శింబు తల్లి ఉషా కూడా గాయనిగా మారారు. సంతానం హీరోగా తెరకెక్కుతున్న 'సక్క పోడు పోడు రాజా' చిత్రానికి శింబు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. హాస్యనటుడు వీటీవీ గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పోర్షన్స్ పూర్తి చేసుకుని, వచ్చే వారంలో పాటల చిత్రీకరణ జరుపుకోనుంది.
ఊటీ, బెంగళూరు, చెన్నైలతోపాటు అమెరికాలోనూ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com