కుక్కలని కాల్చబోతే ...కుర్రోడి ప్రాణాలు తీసిన బుల్లెట్.. ఒమాని వ్యక్తి అరెస్టు

- March 10, 2017 , by Maagulf
కుక్కలని కాల్చబోతే ...కుర్రోడి ప్రాణాలు తీసిన  బుల్లెట్.. ఒమాని వ్యక్తి  అరెస్టు

మస్కట్:మేకలను చంపుతున్న కుక్కల సమూహంపై  తుపాకీతో కాల్చబోతే, గురి తప్పి ఆ  బులెట్  ఓ నాలుగేళ్ళ ఓమాని బాలుడి ప్రాణాలను బలిగొంది. దీనితో సుడి లేని  ఆ షూటర్ అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఘటన గత నెలలో జలాన్ బాణీ బు ఆలీ రాష్ట్రంలో జరిగింది. రాయల్ ఒమన్ పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం ఉంది. ఓ 30 ఏళ్ళ ఓమాని వ్యక్తి తన మేకలు అనేక మొత్తంలోచనిపోవడానికి కారణమైన కుక్కల మందపైకి కాల్పులు జరిపినట్లు నేర పరిశోధకుల ఎదుట అంగీకరించాడని తెలిపారు. విచ్చలవిడి బుల్లెట్లల  ఒకటి తన దిశను మార్చుకొని పక్క వీధిలో తన స్నేహితునితో కూర్చొన్న ఓ నాలుగేళ్ల ఓమాని బాలుడి బుర్రలోకి బులెట్ దూసుకుపోవడంతో తక్షణమే ఆ చిన్నారి మరణించారు.మరో ఘటనలో 2015 లో డిబ్బా ప్రావిన్స్ లో ముసణ్డం ఒక వివాహ వేడుకల సమయంలో గాల్లోకి పేల్చిన ఓ బులెట్  ఒక నాలుగు ఏళ్ల సౌదీ బాలిక  బుగ్గ ను తాకడంతో తీవ్రంగా గాయపడింది. తుపాకీ కాల్పులు జరిపిన  వ్యక్తిని  అరెస్టు చేసి  ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com