మొద‌లైన ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు

- March 10, 2017 , by Maagulf
మొద‌లైన ఐదు రాష్ట్రాల్లో  ఓట్ల లెక్కింపు

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే దాదాపు 20వేల భద్రతా సిబ్బంది విధులు నిర్వరిస్తున్నారు. యూపీలోని 75 జిల్లాల్లో 78 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉత్తరాఖండ్‌లో 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంజాబ్‌లో 27 ప్రాంతాల్లోని 54 కేంద్రాలు, గోవాలో రెండు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభ‌మైంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లోకి ఎటువంటి మొబైల్‌ ఫోన్లు తీసుకురాకూడదని ఎన్నికల కమిషన్‌ కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని భద్రతా అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరిగే గదుల్లో కేంద్ర భద్రతా బలగాలు మాత్రమే ఉంటారని, వెలుపల స్థానిక పోలీసులు ఉండనున్నట్లు ఈసీ వెల్లడించింది. గుర్తు తెలియని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల వద్దకు అనుమతించవద్దని తెలిపింది. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలకు సుమారు 100మీటర్ల దూరం వరకు వాహనాలు, పాదచారులను అనుమతించడానికి వీల్లేదు. స్ట్రాంగ్‌ రూమ్స్‌ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చే ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com