త్రివిక్రమ్ నిర్మాతగా నాని హీరోగా

- March 11, 2017 , by Maagulf
త్రివిక్రమ్ నిర్మాతగా నాని హీరోగా

డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ లతో మంచి ఫాంలో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో నాని. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ మంచి విజయాలు సాధిస్తున్న ఈ యంగ్ హీరో ఓ స్టార్ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతున్నాడు. ఇప్పటికే రాజమౌళి, గౌతమ్ మీనన్ లాంటి టాప్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేసిన నాని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈసినిమాను త్రివిక్రమ్ నిర్మాతగానే వ్యవహరించనున్నాడు.

ఇటీవల పవన్ కళ్యాణ్ తో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించిన త్రివిక్రమ్ ఇప్పటికే నితిన్ హీరోగా సినిమాను ప్రారంభించాడు. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందు నాని హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం శివా నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమాలో నటిస్తున్నాడు నాని. ఆ తరువాత కూడా మరో రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. మరి వీటిని పక్కన పెట్టి అవసరాల సినిమాను స్టార్ట్ చేస్తాడా..? లేక అవన్నీ పూర్తి చేసే కొత్త సినిమా ప్రారంభిస్తాడా..? తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరుకు వెయిట్ చేయాల్సిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com