పవన్ కోసం 5 కోట్లతో ఇల్లు కట్టిస్తున్న త్రివిక్రమ్
- March 11, 2017
ఒకప్పుడు భారీ సెట్టింగులు అనగానే టాలీవుడ్ లో గుణశేఖర్ గుర్తొచ్చేవాడు. ఒక్కడు కోసం వేసిన చార్మినార్, అర్జున్ కోసం వేసిన మథుర మీనాక్షి టెంపుల్ సెట్స్ కళ్ళముందు గుర్తొస్తాయి, అయితే ఇప్పుడు త్రివిక్రం కూదా సెట్టింగుల మీద బాగానే దృష్టిపెడతాడు ముఖ్యంగా హీరో ఉండే ఇళ్ళ మీద, జల్సాలో పవన్ బ్యాచ్ ఉండే ఇల్లు, జైలూ, అత్తారింటికి దారేది లో వేసిన ఇంటిసెట్టు ఒకేత్తయితే మొన్నటికి మొన్న అ ఆ కోసం కూడా సెట్లు వేయించిన సంగతి తెలిసిందే. ఇకైప్పుడు కూడా ఇంకో ఇల్లు సెట్ వేస్తున్నారట అదీ మళ్ళీ పవన్ కోసమే
ఒక వైపున 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంటూ వుండగా, మరో వైపున పవన్ తదుపరి సినిమాకి రంగం సిద్ధమవుతోంది.
పవన్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్నారు.
గతంలో పవన్ 'జల్సా' మూవీ కోసం .. 'అత్తారింటికి దారేది' కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తో త్రివిక్రమ్ భారీ సెట్స్ వేయించాడు. అలాగే ఈ సినిమాలోను 5 కోట్ల రూపాయలతో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ ఈ సెట్ లోనే జరగనుందని అంటున్నారు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూడవ సినిమా కావడంతో, అభిమానులంతా ఆసక్తితో వున్నారు. ఒక్క సెట్ కోసమే 5 కోట్లంటే ఇక ఆ సినిమా ఎంత రిచ్ గా కనిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







